

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘విశ్వంభర’ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, తన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లీతో మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా 158 కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల (ఫిబ్రవరి) చివర లేదా వచ్చే నెల (మార్చి) నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాలో మరో కీలక గెస్ట్ రోల్ ఉండబోతుందని టాక్. సెకండ్ హాఫ్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఒక యంగ్ హీరో కనిపించనున్నాడని అంటున్నారు. మొదట తమిళ నటుడు కార్తీ పేరు వినిపించినా, ఇప్పుడు తెలుగు యంగ్ హీరోనే ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో ముఖ్యంగా ఉండనుంది. హీరోయిన్గా ప్రియమణి పేరు వినిపిస్తుండగా, మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా ఏ.ఆర్ రెహమాన్ ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. నిర్మాణ బాధ్యతలు కేవీఎన్ ప్రొడషన్స్ చేపట్టనుంది.
కథలో తండ్రీ – కూతుళ్ల భావోద్వేగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. చిరంజీవి ఒక పవర్ఫుల్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ కీలక కూతురు పాత్ర కోసం సారా అర్జున్, అనస్వర రాజన్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకందన్ (Preity Mukhundhan)ను ఎంపిక చేసినట్లు టాక్. ఆమె ఇటీవల కన్నప్పలో నటించారు. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కుదిరితే ప్రీతీ కెరీర్‌కు ఇది పెద్ద అవకాశమవుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!