

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా, దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ జన నాయగన్ ఈ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో జనవరి 9 న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. విజయ్ కెరీర్లో చివరి సినిమాగా ప్రచారం పొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, ఇది బాలయ్య సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరికి రీమేక్ అనే విషయం కూడా ఇప్పుడు స్పష్టమైంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. థియేటర్లలో రిలీజ్ కాకముందే జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజా టాక్ ప్రకారం, ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉందట. అంటే నెల తిరక్కుండానే ఓటీటీలోకి వస్తుందన్న మాట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!