

ఈ మధ్య సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తప్పనిసరి అయిపోయాయి. కథ ఎంత బాగున్నా, పెద్ద హీరోలు ఉన్నా, సినిమాకు అదనపు క్రేజ్ తీసుకొచ్చేది ఎక్కువగా ఐటమ్ పాటలే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాంటి పాటలకు తమన్నా ఓ బ్రాండ్‌లా మారింది. రజనీ నటించిన జైలర్ సినిమాలో ఆమె చేసిన కావాలయ్యా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
అలాగే కూలీ సినిమాలో పూజా హెగ్డే చేసిన మోనికా పాట కూడా మంచి మైలేజ్ తెచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉండబోతుందని టాక్. అయితే ఈసారి తమన్నా కాకుండా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
నోరా ఫతేహి మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి, రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో ప్రత్యేక పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జైలర్ 2 లో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే అది సినిమాకు మరో హైలైట్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.



.jpeg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!