
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ఒక స్థానానికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి నటి త్రిష కృష్ణన్ పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్నప్పటికీ, ప్రస్తుతం టీవీకే అభ్యర్థిగా మరో పేరు బలంగా వినిపిస్తోంది.
తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ను టీవీకే అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న లారెన్స్‌కు యువతలో కూడా మంచి ఆదరణ ఉంది. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో టీవీకే తరఫున ఎవరు బరిలో దిగుతారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!