

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. తమిళ్ సినిమాల నుంచి ఎంజీఆర్, తెలుగులో పవన్ కళ్యాణ్ వరకు అందరూ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈ జాబితాలో తాజాగా చేరిన హీరో దళపతి విజయ్. ఆయన తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత, అభిమానుల కోరిక మేరకు టీవీకే అనే పార్టీని ప్రారంభించాడు. రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేస్తానని ప్రకటించాడు.
కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం పెద్ద సమస్యగా మారింది. విజయ్ భార్య సంగీత, ఆయన మరో హీరోయిన్‌తో లివింగ్ రిలేషన్లో ఉన్నాడని, తనను పిల్లలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కేసు వేసింది. విజయ్ నుంచి విడాకులు కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలతో విజయ్ ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టాలా, లేక వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవాలా అన్న దానిపై తడబడుతున్నాడు.
ఇదిలా ఉండగా, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రేరణతోనే ఈ కేసు పెట్టించారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ను రాజకీయంగా బలహీనపరచాలన్న ఉద్దేశ్యంతో అధికార పార్టీ అలా వ్యవహరించిందని టాక్. అంతేకాదు, ఆయన సినిమా జననాయకన్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అడ్డుకున్నారనే మాటలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ తన పార్టీని కొనసాగించాలా, లేక సినిమాలపై దృష్టి పెట్టాలా అని ఆలోచిస్తున్నాడని సమాచారం. రాబోయే ఎన్నికల ఫలితాలు ఆయన నిర్ణయానికి దారి చూపనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!