

దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తూ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. అయితే కీలక క్యాస్టింగ్ అంశాలు ఇంకా ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ పూర్తిస్థాయిలో మొదలవ్వలేదు. ముఖ్యంగా విలన్ పాత్రకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంపై యూనిట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఈ కీలక నెగటివ్ రోల్ కోసం నటనకు దూరంగా ఉన్న ఒక వింటేజ్ హీరోని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందులో వడ్డే నవీన్ పేరు వినిపిస్తోందని తెలుస్తోంది. ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ అనుభవించిన నవీన్ తిరిగి లీడ్ రోల్స్‌తో రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో విలన్ పాత్రను అంగీకరిస్తాడా అనేది అనుమానమే. తెలంగాణ జానపద కళల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ డివోషనల్ కం ఫిక్షనల్ డ్రామాకు హీరోయిన్ ఇంకా ప్రకటించలేదు. బలగం తర్వాత వేణు యెల్దండికి ఇది కీలక చిత్రం కాగా, దసరా లేదా దీపావళి విడుదల లక్ష్యంగా ఉన్నప్పటికీ భారీ ప్రొడక్షన్ ఖర్చులు, వీఎఫెక్స్ పనులు టైమ్‌లైన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!