

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గత ఏడాది ‘ఓజీ’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ప్రస్తుతం ఒప్పుకున్న అన్ని సినిమాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
సమాజం ఎలా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలా పనిచేయాలి అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సీఎం పాత్రలో కనిపిస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. అలాంటి పాత్ర ఉంటే సినిమాకు భారీ హైప్ రావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. సమాజానికి సందేశం ఇచ్చే ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం మంచి విషయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!