

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా రిలీజ్‌కు ఇంకా వారం రోజులే మిగిలి ఉండగా, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ హాజరవుతారా లేదా అనే విషయంలో ఫ్యాన్స్‌లో సందేహాలు ఉన్నాయి. కొందరు మాత్రం ఆయన తప్పకుండా వస్తారని చెబుతున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత చిరంజీవి చిన్న సర్జరీ చేయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మోకాలి సర్జరీ అని కొందరు, నడుముకు సంబంధించినదని మరికొందరు చెబుతున్నారు. ఈ కారణంగా ఆయన గత రెండు వారాలుగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ఫ్యాన్స్ వర్గాల మాట ప్రకారం, చిరంజీవి కొద్ది సేపైనా స్టేజ్‌పైకి వచ్చి అభిమానులతో మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలకు వినూత్న ప్రమోషన్స్ ఉంటాయి. కానీ ఈసారి మెగాస్టార్ నుంచి పెద్దగా పబ్లిసిటీ కనిపించకపోవడానికి ఆయన ఆరోగ్య కారణాలే ప్రధాన కారణమని సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!