

దర్శకుడు బోయపాటి తరువాత సినిమా ఏమిటి? అన్నది ఇండస్ట్రీ జనాల్లో ఓ ప్రశ్న. టాప్ హీరోలు ఈ సమయంలో బోయపాటికి అందుబాటులో లేరు. సీనియర్లలో రవితేజ ఒక్కరే కాస్త డౌన్ ఫాల్ లో వున్నారు. మెగాస్టార్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు సినిమా ఎంపికలో చాలా జాగ్రత్తగా వుంటున్నారు. అందువల్ల, బోయపాటి తెలుగు లో సినిమా చేయాలంటే, మిడ్ రేంజ్ హీరో లేదా యంగ్ హీరోల వైపు చూడాలి.
ఇప్పటికే బోయపాటి హిందీ సినిమాలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు యూనివర్సల్ అంశాలు, మతం, ధర్మం వంటి కథలపై ఆసక్తి ఉంది. “అఖండ 2”లో నార్త్ ఆడియన్స్ని ఆకట్టుకోవడం ఒక సక్సెస్ఫుల్ ప్రయత్నం. బాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంది. అందుకే భక్తి, ధర్మం, దేవాలయ అంశాలతో మాస్ యాక్షన్ మూవీ హిందీలో చేస్తే, మంచి రెస్పాన్స్ వస్తుందనే ఆలోచన.
ప్రస్తుత పరిస్థితుల్లో, నిర్మాతలు ఎవరు అనే అంశం ఇంకా తేలలేదు. అభిషేక్ అగర్వాల్ వంటి కొందరు నిర్మాతలకి ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. కానీ ఇంకా ఫైనల్ డిసిషన్ కాదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇదేమీ ఫైనల్ కాదు. ఆలోచనలు సాగుతున్నాయంతే.
.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!