

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ‘రణబాలి’ చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓ మోస్తరు వసూళ్లతో కొనసాగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న అనంతపురంలో ‘రణబాలి’ సక్సెస్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కార్యక్రమంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమా విడుదలకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటే అనంతపురంలో ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తలతో ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విజయ్ తన మాటను నిలబెట్టుకుని అనంతపురంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారా అనే చర్చ మొదలైంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు. ఆర్నాల్డ్ వోస్లూ, ఈశ్వరీ రావు, షీలా రాజ్‌కుమార్, లాల్ కీలక పాత్రలు పోషించారు. సక్సెస్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!