
ఆరోగ్యం

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మరియు రౌడీ జనార్ధన సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే శౌర్యవ్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పుడు ఆయన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
విక్రమ్ కె కుమార్ ఇప్పటికే విజయ్ దేవరకొండకు ఒక కథ వినిపించగా అది ఆయనకు నచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును తొలుత యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని వార్తలు వచ్చినప్పటికీ, ఆ సంస్థ ప్రస్తుతం తప్పుకున్నట్లు సమాచారం. తాజాగా విజయ్ దేవరకొండ మరియు విక్రమ్ కె కుమార్ కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్డాక్ ఫిల్మ్స్ కార్యాలయంలో కనిపించడంతో, ఈ ప్రాజెక్టు అదే బ్యానర్లో రూపొందే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!