

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా స్పిరిట్ పై కొత్త రూమర్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవర్ఫుల్ పోలీస్ కథతో రాబోతుందని తెలుస్తోంది. ఇందులో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ పూర్తయ్యాక ఒక ప్రత్యేక సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం.
ఈ పాటలో ప్రభాస్ స్టెప్స్‌తో పాటు త్రిప్తి దిమ్రి గ్లామర్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని, యాక్షన్ సన్నివేశాలు చాలా ఆకట్టుకునేలా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. ప్రభాస్ లుక్ కూడా వైల్డ్ అండ్ మాస్ స్టైల్లో కనిపించింది.
ఇక ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారని సమాచారం. ఈ సినిమాను టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కొత్త కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!