

దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. లవ్ జానర్ సినిమాల నుంచి ట్రాక్ మార్చిన తర్వాత వరుస విజయాలు సాధిస్తున్నారు. ‘సర్’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో సూర్యతో ‘సన్నాఫ్ విశ్వనాధం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరితో పని చేయాలని పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. హీరోల డేట్స్ విషయంలో కూడా పెద్దగా సమస్యలేమీ లేవు.
ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి సినిమా నాచురల్ స్టార్ నానితో చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నాని ‘పారడైజ్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు సుజిత్‌తో మరో సినిమా ఉంది. ‘పారడైజ్’ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. దాంతో నాని విలువైన సమయం వృథా అవుతోంది. ఈ కారణంగా ఏప్రిల్‌లో లండన్‌లో సుజిత్ సినిమా ప్రారంభించి, జూన్ నాటికి ఓవర్సీస్ వర్క్ పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
అలా జరిగితే ఈ ఏడాదిలోనే వెంకీ అట్లూరి సినిమా కూడా ప్రారంభించి, ఎక్కువ భాగం పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా ‘పారడైజ్’ సినిమా వల్ల వృథా అయిన సమయాన్ని తిరిగి అందుకోవాలని నాని చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది నాని నుంచి ఒకటి లేదా రెండు సినిమాలు రావచ్చు. వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!