

శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘ఏమో ఏమో ఇది’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను తొలుత అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, అదే తేదీన వెంకటేశ్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ విడుదల కానుండటంతో, సీనియర్ నటుడికి గౌరవం ఇస్తూ తమ చిత్రాన్ని వాయిదా వేయాలని ‘ఏమో ఏమో ఇది’ చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించేందుకు పాటలను వరుసగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ చిత్రంలో దేవదర్శిని, రోషన్ మేకా తల్లి పాత్రలో నటిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!