

చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ అందించాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈరోజే విడుదలైంది. అతను ఈసారి సంక్రాంతి విజేతగా నిలుస్తాడా అనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.
70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ ఇస్తున్నా, కొన్ని సన్నివేశాల్లో ఆయన వయసు స్పష్టంగా కనిపిస్తున్నదని కొంతమంది టాలీవుడ్ అభిమానులు సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయిన చిరంజీవి ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
సినిమా మేధావుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండు సినిమాల తరువాత చిరంజీవి హీరోగా రిటైర్ అయ్యే అవకాశం ఉంది. వయసు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుండటంతో, ఇప్పుడు తన పాత్రలను తగ్గించడం సరైనది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక హీరోగా కాకుండా ఏమైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల ను మెప్పిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక బాబీ , శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తి అవ్వాలంటే మరో రెండు, మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు సంవత్సరాల్లో అతను ఏజ్ ఇంకా పెరిగిపోతుంది. తద్వారా ఆయన మరింత మారే అవకాశాలైతే ఉన్నాయి. ఆయన ఏం చేసిన స్క్రీన్ మీద మాత్రం ఏజ్ తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మరికొంతమంది చెబుతున్నారు. చూడాలి మరి చిరంజీవి ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు అనేది…




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!