

బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ “ధురంధర్ 2: ది రివెంజ్” మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ధురంధర్-1 బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్ ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా రన్‌టైమ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ధురంధర్ 2 నిడివి సుమారు 3 గంటల 55 నిమిషాలు, అంటే బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద సినిమాలలో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. అయితే మేకర్స్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. విదేశాల్లో అన్‌కట్ వెర్షన్ ఎక్కువ నిడివితో విడుదలయ్యే అవకాశం ఉండగా, భారత్‌లో 3 గంటల 40 నిమిషాల ట్రిమ్డ్ వెర్షన్ వచ్చే అవకాశముంది.
సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, యామీ గౌతమ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. ధురంధర్-1 3 గంటల 34 నిమిషాల నిడివితో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అదే రేంజ్లో కథనం ఆకట్టుకుంటే, సీక్వెల్ రన్‌టైమ్ పెద్ద ఇబ్బంది కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి కథ ఇండియా - పాకిస్తాన్ స్పై డ్రామా నేపథ్యంతో రూపొందుతుండటంతో యాక్షన్ సీన్స్, ట్విస్టులు మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నాయి.
ఈ సారి ధురంధర్ 2 హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతోంది. అదే రోజున యష్ నటించిన “టాక్సిక్” కూడా రిలీజ్ కావడంతో ఈ నెల 19 న బాక్సాఫీస్ రేస్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!