

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ వారణాసి దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాకు షో యూ బ్యానర్లో ఎస్.ఎస్. కార్తికేయ మరియు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్. నారాయణ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సుమారు 50 శాతం పూర్తయింది, మరో ఆరు – ఏడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుండి ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవ్వడం, సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తుంది.
మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర పాత్రలో కనిపించనుండగా, ఇంకా నాలుగు ఇతర విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమాలో, మహేష్ బాబు కొంతసేపు రాముడి పాత్రలో కనిపిస్తారని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.
ఇప్పటికే మేకర్స్ అధికారికంగా వారణాసి 2027లో విడుదల కానుందని ప్రకటించారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, సినిమాను 2027 ఏప్రిల్ 9 న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పృథ్వీరాజ్ పాత్రకు జోడీగా లేదా మహేష్ సరసన హీరోయిన్గా దీపిక కనిపించవచ్చన్న వేరువేరు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు, వర్కింగ్ హవర్స్, రెమ్యూనరేషన్ అంశాలపై ఇటీవల కాంట్రవర్సీల్లో ఉన్న దీపికను జక్కన్న కావాలనే ఎంపిక చేసుకున్నాడా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రూమర్స్‌లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మేకర్స్ ఇప్పటికే తమ ప్లానింగ్‌పై పూర్తి క్లారిటీతో ముందుకెళ్తున్నారని, అధికారిక ప్రకటన వచ్చే వరకు దీపిక ఎంట్రీపై నమ్మకంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. అయినప్పటికీ, 'వారణాసి' లాంటి ప్రాజెక్ట్‌కు సంబంధించి చిన్న పుకారు కూడా భారీ సెన్సేషన్‌గా మారడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరోసారి రుజువు చేస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో వేచి చూడాలి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!