

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వరుస వాయిదాలు, నిశ్శబ్దంగా సాగుతున్న నిర్మాణ పనుల కారణంగా సినిమా విడుదలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ రోజు కీలక ప్రకటన చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో అభిమానుల దృష్టి మొత్తం ఈ అప్డేట్పైనే నిలిచింది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం సినిమా విడుదలను ఆగస్టు నెలకు ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. విడుదల తేదీపై స్పష్టత వస్తే, రాబోయే నెలల్లో బాక్సాఫీస్ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!