
జనరల్

అక్కినేని నాగచైతన్య తన తాజా హిట్ “తండేల్” తర్వాత మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో “వృషకర్మ” అనే మైథికల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో కొత్త వార్త వైరల్ అవుతోంది.
కోలీవుడ్ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయబోతున్నారని సమాచారం. రామ్ పోతినేని హీరోగా తీసిన “ది వారియర్”తో నిరాశపరిచిన లింగుసామి ఇప్పుడు చైతన్య కోసం పవర్ఫుల్ మాస్ కథ సిద్ధం చేశారని టాక్. కథ నచ్చడంతో నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన “కస్టడీ” డిజాస్టర్ కావడంతో ఈ కొత్త కాంబినేషన్‌పై అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!