

అల్లు అర్జున్ సినిమాలపై ప్రస్తుతం పరిశ్రమలో విస్తృత చర్చ సాగుతోంది. అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్‌పై ఉండగా, ఆ తర్వాత అల్లు అర్జున్ చేయనున్న కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, తదుపరి సినిమాకు సంబంధించిన స్పష్టత ఇంకా రాలేదు. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఒక భాగంగా వస్తుందా లేక రెండు భాగాలుగా విడుదలవుతుందా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచన అట్లీకి ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా, తొలి భాగాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!