

బన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సమ్మర్ బ్లాక్బస్టర్ పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి సినిమాలో మహేష్ హీరోగా నటిస్తున్నారు. కె ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలను సృష్టిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న వేసవి కానుకగా విడుదలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ సినిమా కూడా వేసవిలో విడుదల కానున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నిర్మించబడుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ బన్నీకి సులభం కాదు, ఎందుకంటే ఇతర భారీ సినిమాలు కూడా సమ్మర్ బరిలోకి వస్తున్నాయి. గతంలో మహేష్, బన్నీ రెండు సార్లు పోటీ పడ్డారు. మొదట మహేష్ గెలిచగా, తర్వాత బన్నీ గెలిచారు. ఈ మూడో రౌండులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!