

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సనా, తమిళ స్టార్ హీరో సూర్య కోసం ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముందని సమాచారం. తొలుత ‘పెద్ది’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని బుచ్చిబాబు భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం మరో కథపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూర్యను కథానాయకుడిగా ఎంపిక చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
సూర్య, బుచ్చిబాబు కాంబినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే, సూర్య ఓ తెలుగు దర్శకుడితో కలిసి పనిచేసే మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సూర్యకు, బుచ్చిబాబు తనదైన కథనంతో కొత్త అనుభూతిని అందించవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ, నిర్మాణ సంస్థ, నటీనటుల ఎంపికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కాంబినేషన్ నిజమవుతుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!