

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కుతున్న 'కింగ్100' వర్కింగ్ టైటిల్ సినిమాతో బిజీగా ఉన్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
తాజా సమాచారం ప్రకారం, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ వీడియోను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ గ్లింప్స్‌కు సంగీతం అందించే పనిలో ఉన్నారని సమాచారం. నాగార్జునకు గతంలో ఎన్నో విజయవంతమైన ఆల్బమ్‌లు అందించిన డీఎస్పీ, ఈ చిత్రానికి కూడా ప్రత్యేకమైన సంగీతాన్ని అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!