

టాలీవుడ్‌లో సంక్రాంతి 2027 కు భారీ సినిమాల సందడి కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో జతకట్టగా, నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి భారీ కమర్షియల్ మూవీకి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్ మళ్లీ హిట్ మేకర్ అనిల్ రావిపూడితో కలవగా, కింగ్ నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఈ నాలుగు కాంబినేషన్లు ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.
ఒకేసారి నాలుగు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రావడం వల్ల సంక్రాంతి 2027 టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తాయని అంచనా. టైటిల్స్, విడుదల తేదీలపై అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!