

మలయాళ భామగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). కమర్షియల్ బ్లాక్బస్టర్లు లేకపోయినా, స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాలు చేయకపోయినా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలతో బిజీగా ఉన్న అనుపమ.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే.. గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఆ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్. ఆ హీరోతో అనుపమ ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఈ డేటింగ్ రూమర్లకు కారణం... వీరిద్దరూ కలిసి నటించిన తాజా తమిళ చిత్రం బైసన్ (Bison). ఈ సినిమాలో అనుపమ-ధ్రువ్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండటంతో పాటు, స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రమోషన్లలో కలిసి ఈవెంట్లకు రావడం, స్టేజ్‌పై సరదా క్షణాలు పంచుకోవడం గాసిప్స్‌ను మరింత పెంచాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ధ్రువ్ విక్రమ్ - అనుపమతో కలిసి దిగిన క్యూట్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి అనుపమ లవ్ ఎమోజీతో రియాక్ట్ కావడం నెటిజన్లలో చర్చకు దారి తీసింది. అంతేకాదు... చెన్నైలో జరిగిన మరో ఈవెంట్లో స్టేజ్‌పైనే ధ్రువ్, అనుపమకు బర్త్‌డే విషెస్ చెప్పగా ఆమె సిగ్గుపడిన వీడియో కూడా వైరల్ అయింది. ఇక ఓ ఈవెంట్ లో యాంకర్ అనుపమను 'అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేయాల్సి వస్తే ఎవరికీ చేస్తారు?' అని ప్రశ్నించగా.. దానికి ఏమాత్రం తడబడకుండా అనుపమ 'ధ్రువ్‌కే చేస్తాను' అని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం అనుపమ వయసు 30 ఏళ్లు కాగా, ధ్రువ్ విక్రమ్ 28. దీంతో 'తనకంటే రెండేళ్లు చిన్నవాడితో డేటింగ్ చేస్తున్నారా?'అంటూ మరో కొత్త డిబేట్ మొదలైంది. పైగా ఇద్దరూ కలిసి పబ్లిక్ ఈవెంట్స్‌లో క్లోజ్‌గా కనిపించడం, ఒకరి పోస్టులకు మరొకరు రియాక్ట్ కావడం ఇవన్నీ రూమర్లను మరింత బలపరుస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అనుపమ కానీ, ధ్రువ్ కానీ అధికారికంగా స్పందించలేదు. సినిమాల విషయానికి వస్తే.. అనుపమ ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మరోవైపు ధ్రువ్ విక్రమ్ కూడా బైసన్ (Bison) హిట్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. మరి వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ నడుస్తోందా? లేక ఇది కేవలం స్నేహమేనా? అన్నది తేలాలంటే.. వాళ్లిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!