
ఓటీటీ

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రాన్ని మొదటగా హీరో రామ్ పోతినేనితో చేయాలని భావించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథను కూడా రామ్‌కు వినిపించినప్పటికీ, అప్పటికే వరుసగా మాస్ చిత్రాలు చేస్తుండడంతో కొంత విరామం కావాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అనంతరం ఈ కథతో రవితేజ హీరోగా సినిమా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంది.
ఇప్పటికే దాదాపు పదేళ్లుగా అనిల్ రావిపూడి – రామ్ పోతినేని కాంబో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ చిత్రాలతో బిజీగా ఉండగా, ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ కాంబినేషన్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2027 దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!