

అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘లెనిన్’. అఖిల్‌కు ఇప్పటివరకు బలమైన హిట్ రాకపోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథను నాగార్జున జాగ్రత్తగా ఎంపిక చేసి, తమ ఫ్యామిలీకి కలిసొచ్చిన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. నిర్మాతగా స్వయంగా నాగార్జున ముందుకు రావడంతో పాటు, మార్కెటింగ్ బలంగా ఉండాలని భావించి సితార నాగవంశీని భాగస్వామిగా తీసుకున్నారు.
సినిమా దాదాపు పూర్తి అయిందని సమాచారం. ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. ఇప్పుడు అందరి దృష్టి రిలీజ్ డేట్‌పైనే ఉంది. అయితే తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
చిత్రబృందం రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది - మే 1 మరియు జూన్ 26. ‘పెద్ది’ సినిమా విడుదల పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ‘పెద్ది’ అదే సమయంలో రాకపోతే, ‘లెనిన్’ ను మే 1 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. వచ్చే నెల చివరి నాటికి క్లారిటీ వచ్చిన తర్వాత ప్రచారం మొదలుపెడతారు. మరోవైపు, ‘పెద్ది’ అనుకున్నట్లే విడుదలైతే, ‘లెనిన్’ రిలీజ్‌ను జూన్ 26 కు మార్చి, మే నుంచి ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తంగా, రెండు తేదీలను సైలెంట్‌గా సిద్ధం చేసి ఉంచినట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!