

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న “అఖండ 2” సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ అంటే వేరే లెవెల్లో ఉంది. ఈ క్రేజ్ వల్లే సినిమా సీడెడ్ ఏరియాలో రికార్డ్ రేంజ్ బిజినెస్ సాధించింది. ఇప్పటికే వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం “అఖండ 2” కర్నూల్ డిస్ట్రిక్ట్ రైట్స్‌ని “ధనుష్ ఫిల్మ్స్” 6.12 కోట్లకు తీసుకుందట, అలాగే సీడెడ్ మొత్తం బిజినెస్ రేంజ్ 24 కోట్లు దాటిందట! ఇది సీనియర్ హీరోల సినిమాల్లో చాలా అరుదుగా జరిగే విషయం. సీడెడ్ లయన్ బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబో అంటేనే ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈసారి కూడా అదే మాస్ మానియా రిపీట్ అవుతుందనడంలో సందేహమే లేదు.
అంతే కాదు ఈ బిజినెస్ ఫిగర్స్ చూసి చూస్తే, టియర్-1 పాన్ ఇండియా సినిమాల రేంజ్‌లోనే “అఖండ 2” ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే, వాళ్లు సినిమా ప్రమోషన్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా అప్డేట్ ఏంటంటే “అఖండ 2” మొదటి పాట ప్రోమో రేపే రిలీజ్ కానుంది!











కామెంట్స్ (3)
Balayya never disappoints!
“బాలయ్య సింహం మళ్లీ గర్జించడానికి సిద్ధమైంది!”
బోయపాటి డైరెక్షన్ + లయన్ బెలవాడి = Cinema theatre burn🔥