

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్లో మరో చారిత్రాత్మక ఘట్టం చేరబోతోందన్న వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. టాలీవుడ్లో తనదైన స్టైల్, డెడికేషన్, బాక్సాఫీస్ రికార్డులతో నేషనల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ ఇప్పుడు బాలీవుడ్లో డెబ్యూ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా భారీ పీరియాడిక్ చిత్రాలు, గ్రాండ్ విజువల్స్‌కు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతోనేనని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల నిజానిజాలు తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్–భన్సాలీ కాంబినేషన్లో రూపొందనున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్కేల్, ఇంటెన్స్ డ్రామా, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు భన్సాలీ సిద్ధమవుతున్నారని టాక్. బన్నీ ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్ఫుల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని సమాచారం. ‘పుష్ప’తో నార్త్ ఆడియన్స్‌లో భారీ ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో హిందీ మార్కెట్లో తన స్టామినాను మరింత పెంచుకునే అవకాశముంది. ప్రస్తుతం బన్నీ అట్లీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండగా, లోకేష్ కనగరాజ్‌తో మరో సినిమా లైనప్‌లో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ వాయిదా పడిన నేపథ్యంలో బాలీవుడ్ ఎంట్రీ వార్తలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!