
న్యూస్

టాలీవుడ్ టాప్ స్టార్లు ప్రభాస్ మరియు మహేష్ బాబు వీరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పుడు వీరిద్దరిని కలిపి భారీ మల్టీస్టారర్ మూవీ చేయాలనుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మురుగదాస్ తెరకెక్కించాలని, ఆ ఆలోచనకు దివంగత నటుడు కృష్ణరాజు మద్దతు ఇచ్చారని టాక్. కానీ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో ఆ సినిమా ఆగిపోయిందట.
ఇప్పుడు ఈ కాంబో రూమర్ మళ్లీ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అభిమానులు “ఇద్దరి కాంబినేషన్ సినిమా వస్తే పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ అయేదే” అంటున్నారు.ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉండగా, మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!