
న్యూస్

కోలీవుడ్లో తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మరో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. దర్శకుడిగా ఆయన తీసుకునే పారితోషకం 50 కోట్ల రూపాయలని ఇటీవలే ఆయన స్వయంగా ధృవీకరించాడు.
ఇక ఇప్పుడు హీరోగా మారిన లోకేష్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని సమాచారం. తన మొదటి సినిమాకే సుమారు 35 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఈ టాక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
డెబ్యూ హీరోగా ఇంత భారీ మొత్తాన్ని అందుకుంటున్న ఏకైక నటుడిగా లోకేష్ నిలిచాడు. ఈ విధంగా దర్శకుడిగా, హీరోగా రెండింటిలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు.











కామెంట్స్ (1)
లోకేష్ కనగరాజ్ నిజంగా వేరే లెవల్లో ఉన్నాడు!