
జనరల్

పుణేలో మహిళా న్యాయవాదిపై కదులుతున్న కారులో లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నాకు చెందిన మహిళా లాయర్ పని నిమిత్తం పుణేకు వచ్చి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేశారు. హోటల్లోని పబ్‌లో ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడిన అనంతరం మరో పబ్‌కు వెళ్లేందుకు కారులో బయలుదేరినట్లు సమాచారం.
ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించారు. అనంతరం మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!