

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఖరీదైన బ్రాండెడ్ మందుల బదులుగా జనరిక్ మందులను ఎంచుకుంటే వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జనరిక్ మందుల్లో బ్రాండెడ్ మందుల మాదిరిగానే అదే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్ (API) ఉండటంతో పాటు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల ప్రకారమే తయారు చేస్తారు. అందువల్ల వాటి ప్రభావం, భద్రత, వ్యాధిని నయం చేసే సామర్థ్యంలో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేస్తున్నారు.
బ్రాండెడ్ మందుల ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వాటిపై కంపెనీలు చేసే మార్కెటింగ్, ప్రకటనలు, ప్యాకేజింగ్, ప్రమోషన్ ఖర్చులేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోగి వైద్యులను ప్రిస్క్రిప్షన్‌లో బ్రాండ్ పేరుతో పాటు జనరిక్ (API) పేరును కూడా రాయమని కోరే హక్కు కలిగి ఉంటారు. అలాగే జన్ ఔషధి సుగమ్ యాప్ ద్వారా సమీపంలోని జన్ ఔషధి కేంద్రాలు, జనరిక్ మెడిసిన్ స్టోర్ల వివరాలు తెలుసుకుని, అదే నాణ్యత కలిగిన మందులను 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!