16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెడీ.. దసరా నుంచి ఓపీ సేవలు

Writer: Harika S 10:47 AM, 16 అక్టోబర్, 2026
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెడీ.. దసరా నుంచి ఓపీ సేవలు

వరంగల్‌లోని పాత సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 20న దసరా సందర్భంగా ఆసుపత్రిలో ఓపీ సేవలను ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సహచర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఎల్. నాగరాజు, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వైద్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, వైద్యులు, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఆసుపత్రిలోని వైద్య విభాగాలు, రోగులకు కల్పించనున్న సదుపాయాలు, చికిత్సకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని పనులను వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. అక్టోబర్ 17న మరోసారి పనులను పరిశీలిస్తామని, డిసెంబర్ నాటికి ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన సంపాదనపై ఉప్పల్ బాలు ఆసక్తికర వ్యాఖ్యలు

తన సంపాదనపై ఉప్పల్ బాలు ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

మాదాపూర్‌లో రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

మాదాపూర్‌లో రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

ట్యాగ్లు
వరంగల్ ఆసుపత్రిమల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ వైద్యంఓపీ సేవలుఉచిత వైద్య సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన.. ముంబయికి మళ్లించిన విమానం
జనరల్

దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన.. ముంబయికి మళ్లించిన విమానం

ఢిల్లీ సెంట్రల్ పార్క్ వద్ద సీజేపీ నిరసన.. పోలీసుల ఆంక్షలు
జనరల్

ఢిల్లీ సెంట్రల్ పార్క్ వద్ద సీజేపీ నిరసన.. పోలీసుల ఆంక్షలు

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..
క్రీడలు

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..

తన సంపాదనపై ఉప్పల్ బాలు ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

తన సంపాదనపై ఉప్పల్ బాలు ఆసక్తికర వ్యాఖ్యలు

మందులను ఎక్కడ నిల్వ చేయాలి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే!
ఆరోగ్యం

మందులను ఎక్కడ నిల్వ చేయాలి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే!

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్
జనరల్

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!
ఆరోగ్యం

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
జనరల్

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు
జనరల్

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!
క్రీడలు

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!