

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ప్రభుత్వం వలసలు, వీసా నిబంధనల అమలుపై కఠిన వైఖరిని అనుసరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, రద్దు చేసిన వీసాల విభాగాలు, కారణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తాజా ప్రకటనలో స్పష్టంగా పేర్కొనలేదు.
వీసాల రద్దుపై అమెరికా విదేశాంగ శాఖ ఈ ఏడాది ఆగస్టు 10న గతంలో ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు మధ్య కాలంలో సుమారు 1.75 లక్షల వీసాలను రద్దు చేసినట్లు అప్పట్లో వెల్లడించింది. ఆ తర్వాతి రెండు మూడు నెలల్లోనే ఈ సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరినట్లు తాజా ప్రకటన సూచిస్తోంది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, ఇతర కారణాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారా అనే అంశంపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!