
గాసిప్స్

విజయవాడలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బషీర్ను జీఆర్పీఎస్, ఈగల్ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, బషీర్ ఇటీవల నాగ సౌమ్య ద్వారా బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెప్పించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి అని పోలీసులు పేర్కొన్నారు.
విజయవాడలోని కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బషీర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అతడి కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టిన అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సరఫరా నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!