19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బతుకమ్మ సంబురాల్లో విజయ్, రష్మిక ప్రత్యేక సందడి

Writer: Pooja 10:20 AM, 19 అక్టోబర్, 2026
బతుకమ్మ సంబురాల్లో విజయ్, రష్మిక ప్రత్యేక సందడి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం నిర్వహించిన సంబురాలకు మహిళలు, యువతులు, చిన్నారులు భారీగా తరలివచ్చారు. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు నిర్వహించిన మహా బతుకమ్మ ర్యాలీలో 700 మంది జానపద కళాకారులు, 600 మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరం లేజర్‌ షో, బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా దంపతులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మహిళా నేతలు, విదేశీ దౌత్యవేత్తలు ఈ వేడుకలకు హాజరయ్యారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి మహిళను బతుకమ్మలా గౌరవించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. చెరువులు, ఆలయాలు, చారిత్రక ప్రదేశాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో చేరి బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలకు పూజలు నిర్వహించి, సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో సినీ నటులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంత్రి సీతక్క, ఇతర అధికారులతో కలిసి రష్మిక బతుకమ్మ ఆడుతూ మహిళలు, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మ ఆడటం చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద బతుకమ్మ వేడుకలకు రష్మికను తీసుకెళ్లి ఆడిస్తానని గతంలో మాట ఇచ్చానని గుర్తుచేశారు. రాష్ట్రంలో పండుగలు ఇంత ఉత్సాహంగా జరగడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు, రష్మిక బతుకమ్మ ఆటలో పాల్గొని మహిళలతో కలిసి వేడుకలను ఆస్వాదించారు. ఆమె పాల్గొనడం అక్కడి మహిళలు, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలే.. ట్రంప్‌, నెతన్యాహుకు అరాగ్చీ వార్నింగ్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
బతుకమ్మ పండుగసద్దుల బతుకమ్మతెలంగాణ సంస్కృతివిజయ్ దేవరకొండరష్మిక మందన్నహైదరాబాద్ సంబురాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌
సినిమాలు

‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..
జనరల్

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు
జనరల్

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?
జనరల్

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం
సినిమాలు

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 43 ప్రోమో 1.. ఇంట్లో ఏం జరగబోతోంది?

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
జనరల్

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం
జనరల్

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి
సినిమాలు

జైలర్‌ 2 సెట్స్‌లో రజినీకాంత్‌, మోహన్‌బాబు సందడి

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!