
సినిమాలు

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి ఏ క్షణంలోనైనా ప్రకటన రావొచ్చని వార్తలు వస్తున్న వేళ, మరోవైపు ఇరాన్‌పై సైనిక చర్యలకు అమెరికా సిద్ధమవుతోందని నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు వెళ్లే అంశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ సహా కీలక అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్‌పై భవిష్యత్ చర్యలు, దౌత్య చర్చల విఫలత పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్ కార్యక్రమాల్లో మార్పులు జరిగినట్లు కూడా సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!