
జనరల్

ఐసిస్‌కు చెందిన రెండో స్థాయి కీలక కమాండర్ అబు బిలాల్ అల్ మినూకిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మరియు నైజీరియా సంయుక్త సైనిక చర్యలో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అతడిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కీలక విజయంగా భావిస్తున్నారు.
ఆఫ్రికాలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడంలో మినూకి కీలక పాత్ర పోషించాడని అమెరికా ఆరోపించింది. అమెరికాపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాడనే కారణంతో 2023లో అతడిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించారు. సుమారు 12 ఆఫ్రికన్ దేశాల్లో అతడి నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌తో ఉగ్రవాదానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ట్రంప్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!