

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా గల్ఫ్ ప్రాంతంలో సైనిక శక్తిని భారీగా పెంచుతోంది. ఇప్పటికే 3,500 మంది మెరైన్లు, సైనికులను ఇరాన్ ప్రధాన భూభాగం మరియు ఖర్గ్ ద్వీపంపై దాడి చేయగల దూరంలో మోహరించింది. మొత్తం 50 వేల మందికి పైగా అమెరికా సైన్యం అక్కడ ఉన్నట్లు అంచనా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు రాగానే దాడులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదనంగా మరో 10 వేల మంది సైనికులను త్వరలో అక్కడికి తరలించే ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
ఇక భూతల దాడులు జరిగితే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా మాత్రం ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ, నౌకా మార్గాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రూపొందిస్తోంది. ముఖ్యంగా ఖర్గ్ ద్వీపాన్ని దిగ్బంధిస్తే ఆర్థికంగా ఇరాన్ బలహీనపడుతుందని భావిస్తోంది. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ప్రకారం, ఇరాన్ ఒప్పందానికి రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!