

శ్వేతసౌధం నూతన ప్రెస్ సెక్రటరీగా నియమితులైన కేటీ జకారియా తన తొలి మీడియా సమావేశంలో అనూహ్యంగా తడబడ్డారని సమాచారం. తన భర్త గురించి మాట్లాడుతున్న సమయంలో పొరపాటున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మీడియా సమావేశాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
కేటీ జకారియా ఇటీవల శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ అవకాశం కల్పించినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. నలుగురు పిల్లలకు తల్లైన ఆమె, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడారు. తన బిజీ ఉద్యోగాన్ని నిర్వహించడంలో భర్త అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని చెప్పారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు కొన్నిసార్లు బాధపడుతున్నానని కూడా వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!