

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ జన్మదినోత్సవానికి ముందు ఒక ఏఐ రూపొందించిన మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఎవ్రీబడీ లవ్స్ ట్రంప్" అనే పాటతో రూపొందిన ఈ వీడియోలో ట్రంప్ భారతదేశంలోని ఓ ఆలయం ముందు బైక్‌పై ప్రయాణించడం, అడవిలో సింహంపై స్వారీ చేయడం, ఎడారిలో ఒంటెపై కనిపించడం వంటి అనేక కల్పిత దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే చంద్రుడిపై అమెరికా జెండా నాటడం, పారా గ్లైడింగ్ చేయడం వంటి సన్నివేశాలు కూడా వీడియోలో చోటుచేసుకున్నాయి.
సుమారు ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అభిమానులు దీనిని వినోదాత్మకంగా ప్రశంసించగా, విమర్శకులు ఏఐ విజువల్స్ మరియు స్వీయ ప్రచార శైలిపై విమర్శలు గుప్పించారు. రాజకీయ రంగంలో ఏఐ ఆధారిత కంటెంట్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో విస్తృత చర్చకు దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!