
జనరల్

ఎన్నో నెలల ఆలస్యానంతరం ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్‌ఫోన్ అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ థీమ్‌తో రూపొందించిన ఈ ఫోన్ ధర $499గా నిర్ణయించగా, డొనాల్డ్ ట్రంప్ బ్రాండింగ్‌తో అనుసంధానమైన “47 ప్లాన్” మొబైల్ సేవతో దీనిని మార్కెట్ చేస్తున్నారు.
ఈ ఫోన్‌ను “అమెరికన్ డిజైన్”గా కంపెనీ ప్రచారం చేస్తున్నప్పటికీ, తయారీ వివరాలు, డెలివరీ ఆలస్యం, డిజైన్ లోపాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రంప్ అభిమానులు దీనిని ఆపిల్, శాంసంగ్‌లకు ప్రత్యామ్నాయంగా చెబుతుండగా, విమర్శకులు మాత్రం పోటీ అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!