16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

Writer: Pooja 07:40 AM, 16 అక్టోబర్, 2026
గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ వాహనసేవ ఈరోజు జరగనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈరోజు తిరుమలకు ఆర్టీసీ, టీటీడీ వాహనాలు మినహా ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించారు. ద్విచక్ర వాహనాలు, యాత్రికుల బస్సులు, ఇతర వాహనాల కోసం తిరుపతిలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ద్విచక్ర వాహనదారుల కోసం బాలాజీ లింక్‌ బస్టాండ్‌, నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌, ఎస్వీ వైద్య కళాశాల, ఇస్కాన్‌ గ్రౌండ్‌లలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. యాత్రికుల బస్సులకు జూపార్కు రోడ్డులోని దేవలోక్‌, ట్రిడెంట్‌, మ్యాంగో మార్కెట్‌ వద్ద, కార్లకు భారతీయ విద్యాభవన్‌, అలిపిరి లింక్‌ బస్టాండ్‌, ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానాల్లో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. పార్కింగ్‌ వివరాలను క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా సామాజిక మాధ్యమాలు, ఫ్లెక్సీలపై అందుబాటులో ఉంచారు. చిత్తూరు, మదనపల్లె నుంచి వచ్చే బస్సులు కాలూరు క్రాస్‌, ఆర్సీపురం జంక్షన్‌ మీదుగా, చెన్నై, పుత్తూరు నుంచి వచ్చే బస్సులు సింధు ఫ్లైఓవర్‌, తనపల్లె జంక్షన్‌ మీదుగా, కడప, శ్రీకాళహస్తి నుంచి వచ్చే బస్సులు రమణ విలాస్‌ జంక్షన్‌, గాజులమండ్యం సర్కిల్‌, తనపల్లె జంక్షన్‌ మీదుగా గరుడ ఫ్లైఓవర్‌ చేరుకుని ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

రింగ్‌ రోడ్డు హత్య కేసులో మరో కీలక పరిణామం

రింగ్‌ రోడ్డు హత్య కేసులో మరో కీలక పరిణామం

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

ట్యాగ్లు
తిరుమలగరుడ సేవటీటీడీతిరుపతి ట్రాఫిక్భక్తుల భద్రతనవరాత్రి బ్రహ్మోత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణబాలి..నిజాయితీ ప్రయత్నం!
సినిమాలు

రణబాలి..నిజాయితీ ప్రయత్నం!

జైలర్ 2: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్ అప్సెట్?
గాసిప్స్

జైలర్ 2: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్ అప్సెట్?

ఇండియన్ 3 కోసం శంకర్ కీలక నిర్ణయం?
గాసిప్స్

ఇండియన్ 3 కోసం శంకర్ కీలక నిర్ణయం?

వన్ మూన్.. వన్ సన్..75 ఏళ్ల సూపర్ స్టార్!
సినిమాలు

వన్ మూన్.. వన్ సన్..75 ఏళ్ల సూపర్ స్టార్!

తప్పుడు దర్శకుడిని ఎంచుకున్న విజయ్?
సినిమాలు

తప్పుడు దర్శకుడిని ఎంచుకున్న విజయ్?

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం
జనరల్

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

రింగ్‌ రోడ్డు హత్య కేసులో మరో కీలక పరిణామం
జనరల్

రింగ్‌ రోడ్డు హత్య కేసులో మరో కీలక పరిణామం

మస్క్ వ్యాఖ్యలపై రిలయన్స్ ఘాటు స్పందన
బిజినెస్

మస్క్ వ్యాఖ్యలపై రిలయన్స్ ఘాటు స్పందన

క్రేజీ కళ్యాణం రివ్యూ: కూతురి పెళ్లిపై తండ్రి పంతం..క్రేజీ కళ్యాణం ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

క్రేజీ కళ్యాణం రివ్యూ: కూతురి పెళ్లిపై తండ్రి పంతం..క్రేజీ కళ్యాణం ప్రేక్షకులను మెప్పించిందా?

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!