

నిజామాబాద్‌లో పండుగ సాయన్న జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధైర్యశాలి పండుగ సాయన్న అని, తెలంగాణ గడ్డపై ప్రజా తిరుగుబాటుకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. నిజాం పాలనలో దొరలు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా సాయన్న సాగించిన పోరాటం అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని నింపిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన పండుగ సాయన్న పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, పేదలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆయన ఆశయాల ప్రకారం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని, తెలంగాణలో పేదల సంక్షేమం, సమాన అవకాశాలను మరింత బలోపేతం చేయడమే పండుగ సాయన్నకు అందించే నిజమైన నివాళి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!