
సినిమాలు

చైనాలో బావి తుఫాన్ ప్రభావంతో జేజియాంగ్ ప్రావిన్స్‌లో జూలై 19న సంభవించిన శక్తివంతమైన టోర్నడో భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు టోర్నడో ప్రభావంతో గాల్లోకి ఎగిరిపోయిన భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ప్రకృతి విపత్తుతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, నష్టం అంచనా వేసే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ఘటన చైనాలో తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసేలా చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!