17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: ఏ రాశి వారికి శుభయోగం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

Writer: Pooja 05:25 AM, 17 అక్టోబర్, 2026
నేటి రాశిఫలాలు: ఏ రాశి వారికి శుభయోగం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

మేషం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. దూరప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

వృషభం: ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉత్సాహకరమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. శ్రీరామ నామస్మరణ శుభప్రదం.

మిథునం: సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి ఫలితాలు సాధిస్తారు. శుభపరిణామాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం శ్రేయస్కరం.

కర్కాటకం: అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటారు. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇతరులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. చిన్న విషయాలకు ఆందోళన చెందవద్దు. ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం.

సింహం: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. మీ అంకితభావానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. బాధ్యతలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలి. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.

కన్య: ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటారు. మహాగణపతి ఆరాధన శుభప్రదం.

తుల: ముఖ్యమైన పనులపై ఏకాగ్రత అవసరం. కుటుంబ పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. పనిభారం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. కీలక నిర్ణయాల్లో తొందరపడవద్దు. ఇతరులతో విభేదాలకు దూరంగా ఉండాలి. ఈశ్వర నామస్మరణ శుభప్రదం.

వృశ్చికం: ధార్మిక ఆలోచనలతో ముందుకు సాగుతారు. అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి. చాకచక్యంగా వ్యవహరించి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కీలక చర్చలు అనుకూలించే అవకాశం ఉంది. శ్రీప్రసన్నాంజనేయస్వామి స్తోత్ర పారాయణం శుభప్రదం.

ధనుస్సు: ముందస్తు ప్రణాళికతో ముఖ్యమైన పనులను ప్రారంభించాలి. అనుకూలమైన సమాచారం అందుతుంది. ఉన్నతాధికారులతో మర్యాదగా వ్యవహరించాలి. ఆవేశానికి దూరంగా ఉండి సహనంతో నిర్ణయాలు తీసుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

మకరం: మీ ప్రతిభకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. గోసేవ, విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.

కుంభం: ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. అవసరమైన సమయంలో ఇతరుల సహకారం లభిస్తుంది. అధికార సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్ర పారాయణం శుభప్రదం.

మీనం: ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికంగా పురోగతి ఉండటంతో పాటు ఆదాయ అవకాశాలు మెరుగుపడవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

ట్యాగ్లు
నేటి రాశిఫలాలురాశిచక్రంజ్యోతిష్యంజాతక ఫలితాలుఆధ్యాత్మికంగ్రహగతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
జనరల్

నేడు విజయవాడకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా
జనరల్

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు
క్రీడలు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌
రాజకీయాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ
జనరల్

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌
బిజినెస్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!
జనరల్

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
జనరల్

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ
జనరల్

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!