
జనరల్

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ప్రత్యేక పుష్పాలంకరణలు, విలువైన ఆభరణాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వర్ణ రథోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. బంగారు రథంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తిరుమాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మార్మోగాయి. స్వర్ణ రథోత్సవం తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!