

సౌదీ అరేబియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉమ్రా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాల రాకపోకల్లో అంతరాయాలు ఏర్పడటంతో పలువురు యాత్రికులు స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ఈ పరిస్థితితో ఆందోళన చెందుతున్నారు. విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో స్వదేశానికి చేరుకునే విషయంలో అనిశ్చితి నెలకొంది.
మరోవైపు, వీసా గడువు ముగిసిపోతుందేమోనన్న భయం యాత్రికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు నాలుగు వేల మంది భారతీయ ఉమ్రా యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!