

తెలంగాణలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా, అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ సేవ ద్వారా ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నమోదు, ఆధార్ వివరాల నవీకరణ వంటి సేవలను ఇంటి వద్దే పొందవచ్చు. ఇందుకోసం మీ సేవా కేంద్రాలు లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. క్యూలలో వేచి ఉండకుండానే అవసరమైన సేవలను పొందే అవకాశం కల్పించారు.
ఈ సేవలను పొందాలనుకునే వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా మీ సేవా పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయవచ్చు. అనంతరం నిర్ణయించిన సమయంలో మీ సేవా ప్రతినిధి ఇంటికి వచ్చి సంబంధిత సేవను అందిస్తారు. ప్రారంభమైన తొలి నెలలోనే ఈ హెల్ప్‌లైన్‌కు 3,885 కాల్స్ రావడం విశేషం. ప్రస్తుతం CURE పరిధిలోని ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. బుక్ చేసుకున్న సేవను బట్టి వర్తించే రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!